పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంతో పాటు క్రిష్ దర్శత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తయింది. కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. హిందీలో అమితాబ్ నటించిన పింక్ చిత్రం ఘనవిజయం సాధించాయి. 

హిందీ పింక్ లో అమితాబ్ కు ఆయన భార్య పాత్రతో ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉంటాయి. వకీల్ సాబ్ చిత్రంలో పవన్ భార్య పాత్ర కోసం ఇంకా హీరోయిన్ల ఎంపిక జరగలేదట. తాజాగా ఆ రోల్ కోసం ఊహించని పేర్లు వినిపిస్తున్నాయి. 

వకీల్ సాబ్ చిత్ర యూనిట్ క్రేజీ బ్యూటీ శృతి హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ శృతి హాసన్ డేట్స్ కుదరకపోతే ఇలియానాని తీసుకునే ఆలోచనలో కూడా దర్శకుడు వేణు శ్రీరామ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

యాంకర్ మంజూష హాట్ ఫోటోస్.. గ్లామర్ ఫోజులు చూశారా !

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ లు గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో నటించారు. ఇక ఇలియానా పవన్ తో కలసి జల్సా చిత్రంలో రొమాన్స్ చేసింది.పవన్ కళ్యాణ్ ని దృష్టిలో ఉంచుకుని ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వకీల్ సాబ్ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన మగువా మగువా సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ ఆ పాటని అద్భుతంగా కంపోజ్ చేశాడు.