పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేనెప్పుడూ కోరుకోను..అన్నింటికీ దేవుడే ఉన్నాడు.. : రేణుదేశాయ్
పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేనెప్పుడూ కోరుకోనని..అన్నింటికీ దేవుడే ఉన్నాడంటూ రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ తనను పవన్ గురించి మట్లాడొద్దని బెదిరిస్తున్నారని వాపోయారు.

తాజాగా విడుదలైన రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు లో రేణు దేశాయ్ నటించిన విషయం తెలిసిందే. హేమలతా లవణం పాత్రలో ఆమె చక్కగా సరిపోయారు.హేమలత లవణం పాత్రలో ఎంతో హుందాగా కనిపించారు రేణు దేశాయ్. కాసేపు మాత్రమే సినిమాలో రేణు దేశాయ్ కనిపించినప్పటికీ.. ఆ సన్నివేశాలు టైగర్ నాగేశ్వరరావు సినిమాకి ఎంతో ప్లస్ అయ్యాయి. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న చిన్న పాత్రలోనే నటించినప్పటికీ.. సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు రేణు దేశాయ్. దీనికోసం తాజాగా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇందులో భాగంగానే విలేకరులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇరుకునపెట్టే ఇలాంటి ప్రశ్నలు విన్నరేణు దేశాయ్ నవ్వేస్తూ…‘ఆయన గురించి ఈ ప్రశ్నే వద్దు. ఒక పొలిటిషన్ గా ఈ సొసైటీకి అవసరం అని మాత్రమే ఒక వీడియో ద్వారా గతంలో నేను చెప్పాను. అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన సీఎం కావాలనో, వద్దనో నేను కోరుకోను. ఈ విషయాన్ని దేవుడున్నాడు.. ఆయనే నిర్ణయిస్తాడు.
నిజం గెలవాలి బస్సు యాత్ర:నేడు తిరుపతి జిల్లాలో ప్రారంభించనున్న భువనేశ్వరి
కనీసం ఒక సామాన్య మనిషిలా కూడా ఆయన వైపు స్టాండ్ తీసుకోను. ఒకరికి సపోర్ట్ చేయండి.. అని నేను ఎలాంటి ఎన్నికల సందర్భంలో కూడా ప్రచారం చేయను. అవన్నీ నాకు అవసరం లేని విషయాలు. ఇక పవన్ కళ్యాణ్ గురించి నేను ప్రతీసారి నిజాలే చెబుతూ వచ్చాను. నేను నా విడాకుల సమయంలో చెప్పినవి కూడా అన్ని నిజాలే. పవన్ కళ్యాణ్ గురించి కొద్ది రోజుల క్రితం చెప్పిన మాటలు కూడా నిజాలే.. నమ్మకం కుదరకపోతే లై డిటెక్టర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చారు రేణు దేశాయ్.
‘సింగిల్ మదర్ గా జీవితంలో కొనసాగడం చాలా కష్టం నాకు పెద్ద వాళ్ళ సపోర్టు కూడా లేదు నేను ఒంటరిగానే పిల్లలను పోషించుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదు. నేను కచ్చితంగా త్వరలో మరో పెళ్లి చేసుకుంటాను.. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది 100% జరిగే తీరుతుంది. ఆ విషయంలో టైం తీసుకోవడానికి కారణం నేను ఎక్కువగా ఆధ్యా గురించి ఆలోచించడమే. నా బిడ్డలను సరైన క్రమంలో పెంచే విషయంలోనే నేను ఆలోచిస్తున్నాను.. ఆ విధంగా వారిని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను…’ అన్నారు.
‘టైగర్ నాగేశ్వరరావు సినిమా వల్ల నేను ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాను.. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాపై ఇంస్టాగ్రామ్ లో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొద్దు అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కొంతమంది అయితే ఇలాంటి పనులు పనిగట్టుకుని మరీ చేస్తున్నారు. నేను ఏది చేయాలో.. ఏది చేయద్దో.. చెప్పడానికి వాళ్ళు ఎవరు? నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. పవన్ కళ్యాణ్ గురించి నాకు ఇష్టమైతే మాట్లాడతాను.. లేదంటే లేదు... అంటూ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు.