Asianet News TeluguAsianet News Telugu

నిజం గెలవాలి బస్సు యాత్ర: తిరుపతి జిల్లాలో ప్రారంభించనున్న భువనేశ్వరి

టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి  నారా భువనేశ్వరి  నిజం గెలవాలి పేరుతో  బస్సు యాత్రను  ఇవాళ తిరుపతి జిల్లాలో ప్రారంభించనున్నారు. 

 Nara Bhuvaneswari to begin Nijam Gelavali Yatra at Naravaripalle Today lns
Author
First Published Oct 24, 2023, 9:37 AM IST | Last Updated Oct 24, 2023, 3:10 PM IST

తిరుపతి: నేటి నుండి మూడు రోజుల పాటు  టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి  నారా భువనేశ్వరి తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి అనే పేరుతో నారా భువనేశ్వరి  బస్సు యాత్రకు  రేపు  శ్రీకారం చుట్టనున్నారు. 

 

మంగళవారంనాడు నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల నుండి ఆమె నేరుగా నారావారిపల్లెకు చేరుకున్నారు  నారావారిపల్లెలో  పెద్దల సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలోని దళిత వాడలో భువనేశ్వరి  సహపంక్తి భోజనంలో పాల్గొంటారు.

చంద్రబాబు అరెస్ట్ తో  మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు  నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.తిరుపతి జిల్లాలోని  చిన్నబ్బ కుటుంబాన్ని   భువనేశ్వరి  పరామర్శిస్తారు.ఎల్లుండి అగరాలలో మహిళలతో  భువనేశ్వరి సమావేశం కానున్నారు.ఈ నెల  26న ఆటో డ్రైవర్లతో  భువనేశ్వరి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల  27న శ్రీకాళహస్తిలో మహిళలతో భువనేశ్వరి సమావేశమౌతారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు  నిజం గెలవాలి అనే పేరుతో భువనేశ్వరి  రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను  చేపట్టనున్నారు.  ఈ విషయమై  ఇటీవల చంద్రబాబుతో ములాఖత్ లో  భువనేశ్వరి, లోకేష్ లు చర్చించారు. ఈ యాత్రలో  ప్రజలతో ప్రస్తావించాల్సిన అంశాలు, వైఎస్ జగన్ సర్కార్ చంద్రబాబుపై  అక్రమంగా కేసులు బనాయించిందనే విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios