హైపర్ ఆది పేరు చెప్పగానే బుల్లితెరపై జబర్దస్త్ షోలో పంచ్ ల ప్రవాహం కనిపిస్తుంది. యూట్యూబ్ వీడియోలతో ఆది కెరీర్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆది టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. ఆది పంచ్ డైలాగ్స్ కొన్ని విమర్శలపాలైనప్పటికీ.. అతడి కామెడీ టైమింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. 

జబర్దస్త్ షోలో ఏళ్ల తరబడి జడ్జిగా కొనసాగిన నాగబాబు వైదొలగడం, ఈ షోపై కొన్ని విమర్శలు చేయడంతో జబర్దస్త్ వార్తల్లో నిలిచింది. కానీ జబర్దస్త్ కు ఆదరణ మాత్రం తగ్గలేదు. నాగబాబు మరో ప్రముఖ ఛానల్ లో జబర్దస్త్ తరహాలోనే అదిరింది అనే కామెడీ షో ప్రారంభించారు. ఆరంభంలో ఈ షోకు ఆదరణ లభించలేదు. కానీ ప్రస్తుతం నెమ్మదిగా పుంజుకుంటోంది. 

జబర్దస్త్ స్థాయిలో అదిరింది షో ఉండడం లేదని.. స్కిట్ లు ఆకట్టుకోవడం లేదని ప్రేక్షకులను అభిప్రాయపడుతున్నారు. ఇక అదిరింది షో ద్వారా సద్దాం అనే కొత్త కమెడియన్ పాపులర్ అవుతున్నాడు. అతడి స్కిట్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ అప్పుడే అతడు జబర్దస్త్ పై, హైపర్ ఆదిపై సెటైర్లు వేస్తుండడం విమర్శలకు కారణం అవుతోంది. 

అదిరింది షోకు బజ్ తీసుకురావడం కోసం ఇలా చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా సద్దాం తన స్కిట్ లో భాగంగా ఆది కాకుంటే సద్దాం ఉంటాడు ట్రెండింగ్ లో ఉంటాడు అని పంచ్ వేశాడు. దీనిపై సద్దాంపై, అదిరింది షో పై ఆది తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. నేను ఇప్పటివరకు 130 స్కిట్ లో చేసి ఉంటా. 

ప్రియుడితో బ్రేకప్.. నాకు మంచే జరిగింది.. 'వరల్డ్ ఫేమస్ లవర్' హీరోయిన్

అందులో 50 స్కిట్ ల వరకు 30 మిలియన్ల వ్యూస్ దాటాయి. అత్యధికంగా ఓ స్కిట్ 58 మిలియన్ల దాటింది. నా మీద పంచ్ వేయాలంటే ముందు ఇవన్నీ దాటాలి. అంతే కానీ ఐదు వారాలకే హడావిడి చేస్తే ఎలా అంటూ ఆది అదిరింది పై పంచ్ పేల్చాడు. 

ఇక నాగబాబుతో తన బంధం ఎప్పటికి కొనసాగుతుందని తెలిపాడు. ఆయనతో ఐదేళ్ల బంధం నాది. జనసేన పార్టీలో కూడా కలసి పనిచేసినట్లు ఆది పేర్కొన్నాడు. అదిరింది షోకు వెళ్లకపోవడానికి కారణం అక్కడ ఉన్న కొందరు వ్యక్తులే అని ఆది సంచలన వ్యాఖ్యలు చేశాడు.