జబర్దస్త్ షోతో హైపర్ ఆది బుల్లితెర కమెడియన్ గా పాపులర్ అయ్యాడు. కామెడీ పంచులతో అలరించడం హైపర్ ఆది ప్రత్యేకత. ఆది ప్రస్తుతం వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. హైపర్ అది ప్రస్తుతం ఢీ షోలో కూడా పాల్గొంటున్నాడు. తాజాగా ఢీ షోకి సంబంధించిన న్యూఇయర్ ప్రోమో రిలీజ్ చేశారు. 

మంచి మసాలా అంశాల అంశాలతో ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో హైపర్ ఆది, యాంకర్ వర్షిణిలా రొమాన్స్ ని హైలైట్ చేశారు. అల వైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన సాంగ్ కు హైపర్ ఆది, వర్షిణి పెర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి రొమాంటిక్ పెర్ఫామెన్స్ తర్వాత ఆసక్తికర సంభాషణ జరిగింది. శేఖర్ మాస్టర్ అడిగిన ప్రశ్నకు హైపర్ ఆది బదులిస్తూ.. మేమిద్దరం ఒరిజినల్ ఫీల్ తో ఈ సాంగ్ చేశాం.. మా మధ్య ఒకటి నడుస్తోంది అని ఆది కామెంట్స్ చేశాడు. 

పెళ్లి అందుకే సీక్రెట్ గా, నా భర్త వల్లే ఇప్పటికీ .. హీరోయిన్ శ్రీయ!

ఈ కామెంట్ కు అక్కడ నవ్వులు విరిశాయి. ఢీ షోలో శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్, రష్మీ కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. 

హైపర్ ఆది, వర్షిణిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా హైపర్ ఆది అనసూయని ఉద్దేశిస్తూ జబర్దస్త్ షో లో చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో పాటు వివాదంగా మారాయి. గతంలో సుడిగాలి సుధీర్, రష్మీపై చేసిన వ్యాఖ్యల వల్లే వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందనే ప్రచారం ఎక్కువైంది.