పవన్ కళ్యాణ్ పాట పాడితే అది ఏ స్దాయిలో హిట్ అవుతుందో గతంలో చూసాం. సినిమాకు అది ప్రత్యేక ఆకర్షణ అయ్యి కూర్చుంటుంది. కాటమరాయుడా అని పాడినా, కొడుకా కోటీశ్వరరావు అన్నా ఆయనకే చెల్లింది.  సినిమాలో ఏదైనా సంధర్భంలో జానపద గీతానికి చోటు ఉంటే వెంటనే పవన్ గొంతు సవరించుకుంటారు. అదే క్రమంలో మళ్లీ పవన్ కళ్యాణ్ గాయకుడిగా తన టాలెంట్ చూపించబోతున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం ఆయన ఓ పాట పాడబోతున్నట్లు చెప్తున్నారు. దాంతో ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందని చెప్తున్నారు.

ఈ చిత్రం పూర్తిగా  పిరీయాడికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే చిత్రం. ఇందులో జానపద గేయాలకు అవకాసం ఉందిట. దీంతో క్రిష్ ఓ ప్రత్యేకమైన సందర్బంలో పవన్ చేత పాడిస్తే బాగుంటుందని ప్రపోజల్ పెట్టారని, దాన్ని పవన్ ఆమోదించారని అంటున్నారు. త్వరలోనే రికార్డింగ్ జరగనుందిట. నిజంగా ఇదే కనక జరిగితే పవన్ అభిమానులకు పండుగనే అనాలి.

ప‌వ‌న్ త‌న  26వ చిత్రాన్ని వేణు శ్రీ‌రామ్ తో, 27వ చిత్రాన్ని క్రిష్‌తో 28న చిత్రాన్ని హ‌రీష్‌శంక‌ర్‌తో చేస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ 29వ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్నారు.  పింక్ రీమేక్ షెడ్యూల్ రీసెంట్‌గా పూర్తి కావ‌డంతో క్రిష్ సినిమా యూనిట్‌తో క‌లిసారు ప‌వ‌న్‌. ఈ సినిమా కోసం క్లీన్ షేవ్ చేసుకున్న ప‌వ‌న్ కొత్త లుక్‌లో క‌నిపించారు.

18వ శ‌తాబ్దం మొఘ‌ల్‌ ఎరాకు గుర్తుగా పవన్ ఒంటిపై ఓ టాటూ వుంటుంద‌ట‌. పండ‌గ సాయ‌న్న క‌థ‌ ఇది అని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా కోసం ప్రత్యేక పడవని రూపొందిస్తున్నారట. పడవ సెట్ లో తాజా షెడ్యూల్‌ జరగనుందని టాక్ .