గతేడాది 'కేజీఎఫ్' అనే కన్నడ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. విడుదల చేశారు. ఆ సమయంలో ఆ సినిమాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కన్నడ సినిమాని వేరే భాషల్లో ఎవరు పట్టించుకుంటారు.. పైగా యష్ అనే హీరో అప్పటికి ఎవరికీ తెలియదు.

కానీ ట్రైలర్ చూసిన తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమాలో ఏదో విషయం ఉందనిపించింది. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జనాలు లైట్ తీసుకున్నారు. కానీ సినిమాకి వచ్చిన టాక్ ప్రభంజనం సృష్టించింది. బహు భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇస్మార్ట్ పిల్ల కిర్రాక్ ఫోజులు.. చూపు తిప్పుకోలేరు!

ఇప్పుడు కన్నడ నుండి మరో సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. అందులో నటిస్తున్న హీరో కూడా పెద్దగా పరిచయం ఉన్న వాడు కాదు. 'కిరిక్ పార్టీ' సినిమాతో కన్నడలో పాపులర్ ఆయన ఈ హీరో రష్మికని ఎంగేజ్మెంట్ చేసుకొని వార్తల్లో నిలిచాడు.

కానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అదే రక్షిత్ శెట్టి నటించిన సినిమాని కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కూడా సినిమాపై పెద్ద బజ్ లేదు కానీ నిన్న విడుదల చేసిన సినిమా ట్రైలర్ జనాలను ఆకట్టుకుంటోంది.

'అతడే శ్రీమన్నారాయణ' ట్రైలర్.. రంగస్థలానికి కొత్త ఆటగాడొచ్చాడు!

'అతడే శ్రీమన్నారాయణ' అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.సినిమా ట్రైలర్ చూసిన తరువాత జనాల అభిప్రాయం మారింది. సినిమా విజువల్స్, టేకింగ్ అన్నీ కూడా మెప్పించాయి. సినిమాలో కంటెంట్ బలంగా ఉన్నట్లే  కనిపించింది. ఈ సినిమా కూడా 'కేజీఎఫ్' మాదిరి సంచలనాలను సృష్టిస్తుందేమో చూడాలి!