కన్నడ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా దర్శకుడు సచిన్ రూపొందించిన చిత్రం 'అతడే శ్రీమన్నారాయణ'. ఈ సినిమాని కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 

తమిళ్ లో ధనుష్, మలయాళం లో నివిన్ పాల్ ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో రక్షిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. నిధి కోసం వెతికే ముఠా.. దానికో నాయకుడు.. వాళ్లని రక్షిత్ శెట్టి ఎలా డీల్ చేస్తాడనేదే కథే. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

మచ్చుకు కొన్ని.. 
 

''ఒక నాయకుడి ప్రస్థానంలో రెండు యుద్ధాలు.. రణరంగంలో ఒకటి, అంతరంగంలో ఒకటి..''

''దారితప్పిన వాళ్లను క్షమించొచ్చు.. తప్పుడుదారి పట్టినవాళ్లని కాదు.. 

''రంగస్థలానికి ఓ కొత్త ఆట గాడు వచ్చాడనర్ధం''

''ఆడుతూ వెళ్తే వెయ్యేత్తులు.. వెతుకుతూ వెళ్తే వెయ్యి సమాధానాలు.. కానీ ఒక జవాబు నిన్నే వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్ అడగాల్సింది సరైన ప్రశ్న..''. 

ట్రైలర్ అయితే ఆసక్తికరంగానే కట్ చేశారు. మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!