సూపర్ హీరోస్ అంటే మనకు హాలీవుడ్ వాళ్లే గుర్తుకు వస్తారు. కానీ హృతిక్ రోషన్ ఇండియన్ సూపర్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హృతిక్ రోషన్ యువతుల కలల రాకుమారుడు. ఆమాటకొస్తే ఆసియాలోనే మోస్ట్ సెక్సీయెస్ట్ సెలబ్రిటీలుగా హృతిక్ వరుసగా రికార్డులకెక్కుతున్నాడు. 

ఇక దీపికా పదుకొనె గురించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండియన్ సినిమానే ఎలేస్తోంది. దీపికా పదుకొనె తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. హృతిక్ రోషన్.. ఐశ్వర్య  రాయ్, ప్రియాంక చోప్రా లాంటి క్రేజీ హీరోయిన్లతో నటించాడు కానీ ఇంతవరకు దీపికతో రొమాన్స్ చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఆ తరుణం ఆసన్నమైందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హృతిక్ ని సూపర్ హీరో చేసిన క్రిష్ ప్రాంఛైజీ  నుంచి నాలుగో చిత్రం రాబోతోంది. క్రిష్ 4కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ప్రారంభించారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 

భీష్మ 10 రోజుల కలెక్షన్స్.. లాభాల పంట!

ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సిరీస్ లో ప్రియాంక పాత్రకు ముగింపు పలికి దీపికా ని హృతిక్ కి జోడిగా నటింపజేయాలని రాకేష్ రోషన్ భావిస్తున్నారు. ప్రస్తుతం దీపికతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తాను కూడా హృతిక్ తో కలసి నటించే క్షణం కోసం ఎదురుచూస్తున్నాని దీపికా పలు సందర్భాల్లో తెలిపింది.