Asianet News TeluguAsianet News Telugu

మహాభారతం పార్ట్ 1.. కృష్ణావతారంలో హృతిక్‌?

సిల్వర్ స్క్రీన్ పై గతకొంత కాలంగా స్టార్ హీరోలందరు ఒక కథపై చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అదే మహాభారతం. ఈ సినిమా మొదలుపెట్టాలని ఈ తరం తారలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వర్కౌట్ కావడం లేదు. కొందరు బడ్జెట్ కారణంగా ఆగిపోతుంటే మరికొందరు స్క్రిప్ట్ విషయంలో ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు.

hrithik roshan mahabaratham part 1 latest update
Author
Hyderabad, First Published Dec 24, 2019, 3:10 PM IST

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై గతకొంత కాలంగా స్టార్ హీరోలందరు ఒక కథపై చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అదే మహాభారతం. ఈ సినిమా మొదలుపెట్టాలని ఈ తరం తారలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వర్కౌట్ కావడం లేదు. కొందరు బడ్జెట్ కారణంగా ఆగిపోతుంటే మరికొందరు స్క్రిప్ట్ విషయంలో ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు.

hrithik roshan mahabaratham part 1 latest update

 అసలు విషయంలోకి వస్తే.. మొత్తానికి ఒక ప్రముఖ వ్యక్తి మహాభారతంను తెరపైకి తేవడానికి సిద్ధమయ్యారు. మధు మంతెన ఇటీవల ఇచ్చిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ మహాభారతం అభిమానులను ఆకర్షించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే దీపావళికి మొదటి పార్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ ప్రాజెక్ట్ లో కృష్ణుడి పాత్రలో యాక్షన్ హీరో హృతిక్ రోషన్ కనిపించబోతున్నట్లు సమాచారం.

'హనీ ఈజ్ ది బెస్ట్..' మెహ్రీన్ క్యూట్ ఫోటోలు!

ధూమ్ - క్రిష్ - వార్ ఇలా ఎన్నో యాక్షన్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన హృతిక్ ఇప్పుడు కృష్ణుడి పాత్ర కోసం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది. ఇక ద్రౌపతి పాత్రకు ఇప్పటికే స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

hrithik roshan mahabaratham part 1 latest update

అయితే గతంలో అమీర్ ఖాన్ మహాభారతం లాంటి ప్రాజెక్టులో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పాడు. ముఖ్యంగా కృష్ణుడి పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన అమీర్ భవిష్యత్తులో తప్పకుండా అలాంటి సినిమాల్లో నటిస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ హీరో కంటే ముందే హృతిక్ కృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ పాత్ర నేతితరం ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios