టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌, ముద్దుగుమ్మ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా పాటల షూటింగ్ కోసం చిత్రబృందం రోమ్ కి వెళ్లింది. అక్కడ ఈ జంట.. హృతిక్ రోషన్ నటించిన 'వార్' సినిమాలో గుంగ్రూ అనే పాటకి డాన్స్ చేశారు.

స్టార్ హోటల్ లో ప్రొడ్యూసర్ తో హీరోయిన్ గొడవ.. మద్యం బాటిల్ విసిరేసి..!

ఈ డాన్స్ ని హృతిక్ కి అంకితమిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన హృతిక్ స్పందించాడు. 'స్వీట్.. రష్మికలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ‘భీష్మ’ టీంకు ఆల్‌ ది బెస్ట్‌. లవ్‌ యూ గాయ్స్‌' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన రష్మిక ఆనందంతో పొంగిపోయింది.

హృతిక్ కి థాంక్స్ చెబుతూ అతడితో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇది ఇలా ఉండగా.. ఇప్పటివరకు 'భీష్మ'కి సంబంధించి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్‌ ఆడియన్స్ ని మెప్పించాయి.

తాజాగా ఈ సినిమాలో మొదటి పాటని 'సింగిల్స్ ఆంథమ్' గా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు.  మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.