ఒకప్పుడు టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ సంజనా గల్రానీకి బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ లకు మధ్య జరిగిన గొడవ వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి రిచ్‌మండ్‌టౌన్‌లోని ఓ స్టార్ హోటల్ లో వీరిద్దరూ గొడవపడ్డారు.

సంజనా ఏకంగా మద్యం బాటిల్ ని వందనా జైన్ పై విసిరినట్లు తెలుస్తోంది. దీనిపై వందనా జైన్ నగరంలోని కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మధ్యవర్తులు.. సినిమా రంగానికి చెందిన ప్రముఖుల జోక్యంతో రాజీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై శుక్రవారం సంజనా మాట్లాడారు.

వెంటాడి మరీ దొంగలను పట్టించిన సినీ హీరో!

వందనా జైన్ తో గొడవ జరిగిందని.. అది చిన్నపాటిదేనని.. తమ మధ్య చాలాకాలంగా సన్నిహితం ఉందని అన్నారు. హోటల్ లో గొడవ రాజీ చేసుకున్నామని చెప్పారు. కానీ వందనా జైన్ కి రూ.200 కోట్ల ఆస్తి ఎక్కడ నుండి వచ్చిందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

బెంగుళూరులో వందనాకి ఎటువంటి వ్యాపారాల కంపనీలు లేవని.. కానీ రెండు వందల కోట్ల అక్రమ ఆస్తి ఉందని.. ముంబైలో రూ.20 కోట్ల విలువ చేసే బంగాళా ఉందని ఆరోపించారు.

బెంగుళూరు బ్రిగేడ్ రోడ్డులోనూ ఆస్తులు ఉన్నాయని.. ఆమె ఇల్లు కూడా అక్రమమేనని ఆరోపించారు. వందనలాంటి వారు కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో విచారణ జరిపితే బాగుంటుందని అన్నారు.