స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రస్తుతం తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. మలయాళంలో బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ ని పిలుచుకుంటారు. రీసెంట్ గా అల్లు అర్జున్ సంక్రాంతికి వచ్చి ఘనవిజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శత్వంలో తెరకెక్కించిన అల వైలుకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు సృష్టించింది. 

ప్రస్తుతం బన్నీ బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ డాన్సులకు ఇండియా మొత్తం అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ అంటే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లాంటి హీరోలు గుర్తుకు వస్తారు. తాను అల్లు అర్జున్ కు పెద్ద అభిమానిని అని టైగర్ ష్రాఫ్ ఇదివరకే ప్రకటించాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్ కూడా అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ చిత్ర పరిశ్రమ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు హృతిక్ అల్లు అర్జున్, ఇలయథలపతి విజయ్ ల గురించి మాట్లాడాడు. 

డాన్స్ చేయాలంటే చాలా సాధన అవసరం. ఒకవేళ మనం నటులం ఐతే డాన్స్ తో పాటు ముఖంలో కూడా భావాలు పలికించాలి. మన డాన్స్ మూమెంట్స్ లో తప్పులు ఉన్నప్పటికీ ముఖంలో హావభావాల ద్వారా కవర్ చేయవచ్చు అని హృతిక్ తెలిపాడు. దక్షిణాదిలో అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రశ్నించగా.. ఓ మై గాడ్.. అతడి ఎనర్జీ అందరికి ఆదర్శవంతం. విజయ్ డాన్స్ కూడా నన్ను ఆకట్టుకుంటుంది. 

డాన్స్ ఎంజాయ్ చేస్తూ చేయాలి. అప్పుడే ఎనర్జిటిక్ గా కనిపిస్తాం. వీరిద్దరూ డాన్స్ చేసే సమయంలో చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. డాన్స్ చేసే ముందు వీరిద్దరూ ఏం తింటారో తెలుసుకోవాలి అని హృతిక్ సరదాగా వ్యాఖ్యానించాడు. 

ఫ్రాన్స్ కి బయలుదేరిన ప్రభాస్.. అక్కడ వందల మందికి కరోనా!

ఇక హృతిక్ రోషన్ తాను కథల ఎంపిక విషయంలో ఎలా వ్యవహరిస్తానో చెప్పాడు. కథ నచ్చితే 30 సెకన్లలో ఓకే చెప్పేస్తా. అలా 30 సెకన్లలో నా నుంచి సమాధానం రాకుంటే ఆ కథ నచ్చలేదు అని అర్థం. నా మనసు చెప్పినట్లే తాను నడుచుకుంటానని హృతిక్ తెలిపాడు.