తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా… దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. మార్నింగ్  షో నుంచే దుమ్ము దులిపింది. తెలుగులోనూ ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్‌ ను సొంతం చేసుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా.

రిలీజై రెండు భాషలలోను ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు హిందీ వాళ్ల దృష్టి ఈ సినిమాపై పడింది. సరిగ్గా చేస్తే అక్కడ కూడా వసూళ్ళ పరంగా కూడా ఈ యాక్షన్ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.  డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్ ఎంటెర్టైమెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

'ఖైదీ' సక్సెస్ కార్తీ బుర్రకెక్కిందా? ఈ పనులేంటి

కథలో ..దాదాపు పదేళ్ల పాటు జైల్లో ఉండి తొలిసారిగా అనాథ ఆశ్రమంలో ఉన్న తన కూతురిని కలవడానికి హీరో కార్తీ వెళతాడు. మధ్యలో పోలీసులకు సాయపడాల్సి వస్తుంది. ఈ చిత్రం మొత్తం ఒక రాత్రిలో జరిగే కథ. ఈ సినిమా హిందీ రీమేక్‌లో రణవీర్‌ సింగ్‌, హృతిక్‌ రోషన్‌ నటిస్తున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌  ప్రకటించింది. కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో కార్తీ పాత్రను ఎవరు పోషించబోతున్నారనేది మాత్రం క్లారిటీ రాలేదు.

అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ను ఇప్పటికే సంప్రదించారని సమాచారం. హృతిక్ గత ఏడాది వచ్చిన వార్ తో పెద్ద హిట్ కొట్టాడు. అయితే ఆ తరువాత తన తదుపరి చిత్రాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ చిత్రం అతను చేసే అవకాశం ఉందని అంటున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది మేలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మాతృత  డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్ ని మాస్టర్ అనే చిత్రంలో డైరెక్ట్ చేస్తున్నాడు.