చాలా కాలంగా సక్సస్ కోసం ఎదురుచూస్తున్న కార్తికి ఖైదీ సినిమాతో హిట్ వచ్చింది.దాంతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందులో తప్పేమి లేదు కూడా. అయితే అందుకోసం తన నిర్మాతలతో ఆడుకుంటున్నాడని సమాచారం. ఖైదీ సినిమా రిలీజ్ కు ముందు మొదలెట్టిన సినిమాలు రీషూట్ లు చేయమని ఒత్తిడి తెస్తున్నట్లు తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కార్తి  తాను జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనుకుంటున్నాడు కానీ అవి అతి జాగ్రత్తలు అంటున్నారు ఆయనతో చేస్తున్న  నిర్మాతలు.

తన నిర్మాతలను, దర్శకులను పిలిచి స్క్రిప్టులో మార్పులు చేయమని, అవసరమైతే ఖైదీ దర్శకుడుతో స్క్రిప్టు విషయంలో డిస్కస్ చేయమని, తను రికమెండ్ చేస్తానని చెప్తున్నాడట. ఇది చూసిన వాళ్లు సక్సెస్ తలకెక్కించుకున్నాడని అంటున్నాడు. స్క్రిప్టులు మార్చేసి, రీషూట్ చేయటం చాలా బడ్జెట్ తో కూడినది అని చెప్పినా, ఇప్పుడు తనకు మార్కెట్ పెరిగింది కాబట్టి బాగానే బిజినెస్ చేస్తారు కదా..మాపై ఖర్చుపెట్టడానికి బాధేంటి అంటున్నాడట. ఇది కార్తితో సినిమా మొదలెట్టిన నిర్మాతలకు మింగుడు పడటం లేదు.

రీసెంట్ గా తనతో సుల్తాన్ అనే సినిమాని మొదలెట్టిన దర్శకుడుని పిలిచి రీషూట్ పెట్టమని అడిగాడట. తన ఎక్సపెక్టేషన్స్ తగినట్లుగా సినిమా లేదని తేల్చి చెప్పారట. సుల్తాన్ సినిమా ఎనిమిది నెలల క్రితం లాంచ్ అయ్యింది. చాలా భాగం షూటింగ్ కూడా పూర్తైంది. అప్పుడు అద్బుతం అన్న సీన్స్...ఒక హిట్ వచ్చేసరికి చెత్తగా కనపడుతున్నాయని అంటున్నారు. ఎవరెన్ని అనుకున్నా కార్తీ మాత్రం వెనకడుగు వెయ్యటం లేదట. తను ఇప్పటికే చాలా సినిమాలు మొహమాట పడి చేసి, ఫ్లాఫ్ లు కొని తెచ్చుకున్నాను అని, ఇప్పుడు ఆ తప్పు రిలీట్ చేయదలచుకోలేదని నిక్కచ్చిగా చెప్పుతున్నాడట.

కార్తీ, రష్మిక హీరోహీరోయిన్లుగా డ్రీమ్ వారియర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్న కొత్త చిత్రం సుల్తాన్‌’ . ఈ చిత్రానికి భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో శివకార్తికేయన్‌కు ‘రెమో’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించారు. వరుస ఫెయిల్యూర్స్ తరువాత కార్తీ తన వేగం పెంచాడు. ప్రస్తుతం ఓ నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నాడు.  

అలాగే జీతూ జోసఫ్‌ దర్శకత్వంలో తన వదిన జ్యోతికతో కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. జ్యోతిక తమ్ముడిగా కార్తీ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘సుల్తాన్‌’ చిత్రం ద్వారా రష్మిక కోలీవుడ్‌కు పరిచయం కానుంది.