Asianet News TeluguAsianet News Telugu

#Sita Ramam: “సీతారామం”కి వచ్చిన లాభాలు తెలిస్తే షాకే !


హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి మెప్పించారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అద్భుతమైన ప్రేమ కథలో దుల్కర్, మృణాల్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 

How much Profit for Sita Ramam movie?
Author
First Published Sep 25, 2022, 9:50 AM IST

ఈ రోజుల్లో ఏ సినిమా అయినా వీకెండ్ సినిమా అయ్యిపోయింది.  శుక్రవారం నుంచి ఆదివారం వరకే జనాలు ఉంటున్నారు.  ఆ మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ సాధిస్తే సినిమా మొత్తం రన్‌లో మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే రిలీజ్ రోజు మాట్నీకే జనం  థియేటర్లలో ఉండటం లేదు. అలాంటి వాతావరణంలో హౌస్ ఫుల్ బోర్డులు, కంటిన్యూ కలెక్షన్లతో సినిమా మూడు వారాల పైగా సినిమా నడవడం చెప్పుకోదగ్గ ఫీట్. ఆగస్టు 5న విడుదలైన 'సీతా రామం'తో ఇది నెరవేరిందనే చెప్పాలి. 

సినిమా కూడా మూడు,నాలుగు వారాల్లో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. "సీతా రామం" మ్యాజిక్ నేటికీ యాక్టివ్‌గా ఉంది, ముఖ్యంగా బి మరియు సి సెంటర్‌లలో. కుటుంబం మొత్తం చూసే సినిమాలు లేవు. బింబిసార పూర్తిగా మాస్ యాక్షన్ చిత్రం 'సీతా రామం'తో ప్రారంభమైంది. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్  ``సీతా రామం` వైపే మొగ్గు చూపారు.
 
“యుద్ధం రాసిన ప్రేమ కథ” అనే స్టోరీ లైన్ తో… వచ్చిన ఈ సినిమా స్వచ్ఛమైన ప్రేమను తలపించే రీతిలో ఉండటంతో.. ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పట్టారు. దుల్కర్ సల్మాన్. మృణాల్ ఠాకూర్ చాలా అద్భుతంగా పాత్రలలో పరకాయ ప్రవేశం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అయ్యారు. అన్ని వయసుల వారిని ఆకట్టుకునే రీతిలో.. “సీతారామం ” సినీ ప్రేక్షకుల హృదయాలలో చేరగని ముద్ర వేసుకుంది.
 
మొదట తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల చేయటం జరిగింది. ఊహించని విధంగా సినిమా విజయం సాధించడంతో హిందీలో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి ₹51 కోట్ల రూపాయలు అయితే, పెట్టుబడి కంటే అధిక ప్రాఫిట్ దాదాపు ₹13కోట్ల రూపాయలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల  సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్ లో రీసెంట్ గా అత్యధిక లాభం సాధించిన సినిమాగా… “సీతారామం” నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. 

హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి మెప్పించారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అద్భుతమైన ప్రేమ కథలో దుల్కర్, మృణాల్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విశాల్ చంద్ర సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. విడుదలైన అన్ని భాషల్లో సీతారామం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios