జహాపనా మెన్స్ వేర్ షోరూమ్ విశాఖ నగరంలో తమ శాఖను ఆసిల్ మెట్ట దగ్గరలో సంపత్ వినాయక ఆలయం వద్ద ప్రారంభించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా నటి నభా నటేష్, బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ అలీ రెజాల చేతుల మీదుగా షోరూమ్ ని ప్రారంభించారు. ఈ వేడుకకి నభా నతేష్, అలీ రెజాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విశాఖపట్నంలో షోరూం నెలకొల్పటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ చేతుల మీదుగా లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం  ఆనందంగా ఉందని చెప్పారు. 

క్రేజీ న్యూస్.. రవితేజ సినిమాలో సెన్సేషనల్ హీరోయిన్.. విలనా!

షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇసాక్ బుక్రి, ఇబ్రహీం బుక్రి లు మాట్లాడుతూ.. తమ బ్రాంచీలు ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ, బెంగళూరు, తమిళనాడు, పూణే రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపార రంగంలో నాణ్యమైన దుస్తులను అందిస్తుందన్నారు.

విశాఖలో తమ సంస్థ రెండవ షోరూంను ప్రారంభించిన ప్రారంభించిందన్నారు. ప్రత్యేకించి వివాహ వేడుకలకు  డిజైన్ చేసిన దుస్తులను అందించడంలో నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా తయారుచేసి ప్రజలకు అందిస్తున్నామన్నారు. నగర ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు
పాల్గొన్నారు