డిస్కోరాజా తర్వాత రవితేజ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. బలుపు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం క్రమంగా ఆసక్తిని పెంచుతోంది. మరోమారు రవితేజ తో శృతి హాసన్ రొమాన్స్ చేయబోతోంది. 

తాజాగా చిత్ర యూనిట్ మరో ఇంట్రెసింగ్ అప్డేట్ అందించింది. ఈ మూవీలో సంచలన తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ తన విలక్షణ నటనతో మెప్పిస్తోంది. 

కెరీర్ ఆరంభంలో హీరోగా మెప్పించిన వరలక్ష్మి ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటోంది. గత ఏడాది విడుదలైన ఇళయదళపతి విజయ్ చిత్రం సర్కార్ లో వరలక్ష్మి నటించింది. లేడి విలన్ గా ఆమె నటనని ఎవరూ మరచిపోలేరు. 

సర్కార్ మూవీలో హైలైట్ అయిన అంశాలలో వరలక్ష్మి పాత్ర కూడా ఒకటి. ఇప్పుడు రవితేజ మూవీలో నటించబోతుండడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో వరలక్ష్మి విలన్ పాత్రలో నటిస్తుందా లేక మరేదైనా పవర్ ఫుల్ రోలా అనేది తెలియాల్సి ఉంది. 

ఠాగూర్ మధు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. త్వరలో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నారు.