మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రపు అలల మధ్య నిలబడి ఉన్న వైష్ణవ్ తేజ్ స్టిల్ ఆకట్టుకుంది. టైటిల్ కు తగ్గట్లుగా ఈ చిత్రం సముద్ర తీరప్రాంతంలో విలేజ్ డ్రామాగా తెరకెక్కుతోంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, ఎమోషన్ ఈ చిత్రంలో హైలైట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కీర్తి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇద్దరికీ ఇదే డెబ్యూ చిత్రం. కీర్తి శెట్టి లుక్ ని తాజాగా విడుదల చేశారు. వర్షంలో తడుస్తూ గెంతులేస్తున్న యువతిగా కీర్తి శెట్టి కనిపిస్తోంది. కానీ ఆమె ముఖాన్ని మాత్రం చూపించలేదు. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ లో కూడా ఇదే స్ట్రాటజీ పాటించారు. వైష్ణవ్ ముఖాన్ని పూర్తిగా చూపించలేదు. 

నితిన్ తర్వాత మరో హీరో.. మలయాళీ పిల్ల మాయలో టాలీవుడ్ హీరోలు!

సినిమా ప్రమోషన్ లో చిత్ర యూనిట్ సరికొత్త పంథా అవలంభిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.