గోవా బ్యూటీ ఇలియానా కొంతకాలం పాటు  ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసింది. కానీ రీసెంట్ గా ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా ఇలియానా ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి 'ఈ ఫోటో తీసిన నా హబ్బీ' అంటూ పోస్ట్ చేసింది.

ఆ సమయంలో ఇద్దరికీ పెళ్లి అయిపోయిందనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ విషయంపై ఇలియానాని ప్రశ్నించగా.. తనకు సమాధానం చెప్పడం ఇష్టం లేదని.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నానని.. మేమిద్దరం చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నామని చెప్పుకొచ్చింది.

మతిపోగొడుతున్న ఇలియానా క్లీవేజ్ షో.. స్టన్నింగ్ పిక్స్ వైరల్!

అలాంటిది ఈ జంట విడిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. బ్రేకప్ తరువాత ఇలియానా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో వేదాంత ధోరణిలో కొటేషన్ లు పెట్టడం మొదలుపెట్టింది. ఇక రీసెంట్ గా తన బ్రేకప్ కి హద్దులు మీరడమే కారణమని చెప్పింది. అయితే బ్రేకప్ అయిన తరువాత ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందట.

మూడేళ్ల పాటు కలిసి ఉన్న వ్యక్తితో బ్రేకప్ జరగడం ఇలియానా భరించలేకపోయిందని.. ఈ కారణంగా ఆమె మానసికంగా బాగా ఇబ్బంది పడిందని సమాచారం. బ్రేకప్ ని హ్యాండిల్ చేయలేక ఇలియానా సైకియాట్రిస్ట్ ని కలిసిందట. కొన్ని థెరపీ సెషన్స్ కూడా తీసుకుందని తెలుస్తోంది. ఆ విధంగా తన డిప్రెషన్ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. 

తనను తాను బిజీగా ఉంచుకోవడమ కోసం సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పట్లో ఈ బ్యూటీ ప్రేమ జోలికి వెళ్లనని చెప్పేసింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని.. తనను తాను ప్రేమించుకుంటున్నట్లు చెప్పింది.