తెలుగమ్మాయి అంజలి తమిళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు పదిహేనుకి పైగా చిత్రాల్లో నటించింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ఆమె నటనను అంత సులువుగా మర్చిపోలేం. నటిగా ఇప్పటికీ సరికొత్త పాత్రల్లో నటిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. తమిళ ఇండస్ట్రీలో పని చేస్తున్నప్పుడు కొందరు హీరోలు ప్రపోజ్ చేశారని.. ఆ హీరోలందరికీ ఇప్పుడు పెళ్లిళ్లు అయిపోయాయని.. ఇప్పుడు పేర్లు చెబితే వాళ్లింట్లో భూకంపం వస్తుందని నవ్వేసింది.

ఇంతగా దిగజారాలా..? స్టార్ హీరోయిన్ ని 'ఛీ' కొడుతున్న నెటిజన్లు

'మసాలా' సినిమా తరువాత బ్రేక్ తీసుకోవాలనిపించి.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటే.. ఎవరితోనో వెళ్లిపోయానని వార్తలు రాశారని.. కానీ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీ నుండి తనకి మంచి సపోర్ట్ ఉంటుందని.. ఒక స్టేజ్ లో వెంకటేష్, స్రవంతి కిషోర్ లాంటి వ్యక్తుల నుండి సహకారం లభించిందని.. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో తనతో కలిసి పని చేసిన చాలా మంది దర్శకులను ఆటపట్టిస్తుంటానని చెప్పింది అంజలి. అవన్నీ చెబితే తన పరువు పోతుందని నవ్వేసింది. కుర్చీలు లాగేయడం, మైక్ తీసుకొని యాక్షన్-కట్ లు చెప్పడం ఇలా చాలా అల్లరి చేసేదాన్ని అంటూ గుర్తు చేసుకుంది.

ప్రస్తుతం అంజలి తెలుగులో 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. అనుష్క, మాధవన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా అంజలి ఎంతో ఫిట్ గా కనిపించనున్నారు.