బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం 'ఛపాక్'ని బాయ్‌కాట్‌ చేయాలంటూ భారీ సంఖ్యంలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో #boycottchhapak అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. అసలు విషయంలోకి వస్తే.. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ యూనివర్సిటీని మంగళవారం నాడు దీపిక సందర్శించారు.

జేఎన్‌యూ స్టూడెంట్స్, లెక్చరర్స్ పై కొందరు దుండగులు ముసుగులు ధరించి దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ నలుపు నలుపు రంగు బట్టలు ధరించిన దీపిక.. స్టూడెంట్స్ తో భేటీ అయ్యారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నెటిజన్లు దీపికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

'అల.. వైకుంఠపురములో'.. 'RR' సెంటిమెంట్..!

తన సినిమా ప్రచారం కోసం దీపిక ఇంతటి నీచానికి దిగాజారిందనీ.. దేశ ద్రోహులపై ప్రేమ ఒలకబోస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కన్హయ్య కుమార్‌, ఆయిషీ ఘోష్‌ వంటి వారికి దీపిక తన సపోర్ట్ తెలిపింది. మరి దాధిలో గాయపడిన ఏబీవీపీ వాళ్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

నకిలీ ఫెమినిజంతో ఇంకెంతకాలం నెట్టుకొస్తావ్ దీపికా.. అంటూ 'ఛీ' కొడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం దీపికని సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

ఆమె సినిమాలను అడ్డుకోవాలని చూస్తూన్న ప్రతీసారి ఆమె స్థాయి మరింత పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఛపాక్‌ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించడంతో పాటు దీపికా స్వయంగా నిర్మించింది.  జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.