ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రెడ్. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన తడం చిత్రానికి ఇది రీమేక్. హీరో రామ్ ఈ చిత్రంలో విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. 

తాజాగా ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా తమిళ క్యూట్ హీరోయిన్ అమృత అయ్యర్ ఎంపికైంది. అమృత గత ఏడాది విడుదలైన ఇళయదళపతి విజయ్ బిగిల్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమృత ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించింది. 

పవన్, ప్రభాస్ కు అవసరం.. వాళ్లకు తప్పనిసరి.. మిస్సైతే అంతే సంగతులు!

రెడ్ చిత్రంలోకి అమృతకు స్వాగతం పలుకుతూ హీరో రామ్ ట్వీట్ చేశాడు. 2018లో అమృత పాడివీరన్ చిత్రంతో నటిగా పరిచయమైంది. తన క్యూట్ లుక్స్ లో సోషల్ మీడియాలో అమృత బాగా పాపులర్ అయింది. తాజాగా రెడ్ చిత్రంలో రామ్ సరసన నటించనుండడం అమృతకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. 

నాగశౌర్య 'అశ్వథ్థామ' ప్రీమియర్ షో టాక్!

రెడ్ చిత్రంలో ఇప్పటికే నివేత పేతురాజ్, మాళవిక శర్మ నటిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరోసారి రామ్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.