ఈ మధ్యన చాలా మంది దర్శక,నిర్మాతలకు తమ సినిమా  రీమేక్ అయినా ఆ విషయాన్ని ఎక్కడా లీక్ కాకుండా దాస్తున్నారు. గతంలో గర్వంగా చెప్పుకుని బిజినెస్ చేసుకునే రీమేక్ ఎలిమెంట్ ఎందుకునో నామోషీగా కనపిస్తోంది. తమ సొంత క్రియేటివిటి అనిపించుకోవాలనుకుంటున్నారు. రాజుగారి గది 3 సినిమాకు అదే జరిగింది. తమిళంలో వచ్చిన సినిమా రీమేక్ అని ఎక్కడా బయిటపెట్టలేదు. ఇప్పుడు రామ్ కూడా అదే పనిచేయబోతున్నారు.

రామ్ 'రెడ్' మొదలైంది.. ఎమోషనల్ కాంబో యాక్షన్ డోస్

రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్‌ (RED)’. ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రం టీమ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని  ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 16 నుంచి షూటింగ్. రామ్‌-కిషోర్‌ తిరుమల కలిసి చేస్తున్న మూడో చిత్రమిది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్‌ చిత్రంగా ‘రెడ్‌’ రాబోతోంది. రామ్ మొదట ఈ సినిమా వద్దనకున్నారు. కానీ తర్వాత తనను మాస్ గెటప్ లో ప్రెజెంట్ చేస్తారని తెలిసిన తర్వాత ఓకే అన్నారు.

దాంతో ఆ ఉత్సాహంతో తనే డిజైన్ చేసుకున్న ఈ చిత్రంలో తన గెటప్ ,ఫస్ట్ లుక్ సైతం విడుదల చేసారు. అయితే ఓ విషయం రామ్ రివీల్ చేయకుండా దాచేసాడు. అదేమిటంటే...ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన ‘తడమ్‌’కు రీమేక్‌గా రాబోతోంది. ఇందులో రామ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విషయాలని మాత్రం బయిటపెట్టలేదు. స్ట్రెయిట్ సినిమా అన్నట్లుగానే మీడియాతో మాట్లాడారు.