మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో చోటు చేసుకున్న వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అంటున్నారు. బందర్ రోడ్డులో హ్యాపీ మొబైల్ స్టోర్ ని సోమవారం నాడు ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా 'మా' అసోసియేషన్ లో జరుగుతున్న విభేధాల గురించి రామ్ చరణ్ ని ప్రశ్నించగా.. ఆ వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారని.. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారని చెప్పారు.

''ముద్దు సీన్ కోసం రెండు రోజుల ట్రైనింగ్..''

అనంతరం తన కొత్త సినిమా 'RRR'గురించి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ 65 శాతం పూర్తయిందని.. జూలై 30న సినిమాని విడుదల చేస్తామని చెప్పారు. 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి హాజరు కావడంపై స్పందిస్తూ.. సూపర్ స్టార్ సినిమాకి మెగాస్టార్ లాంటి వ్యక్తి వెళ్లడం మంచి పరిణామమని అన్నారు.

తక్కువ సమయంలో సినిమా షూటింగ్ లు పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు ఆర్థికంగా లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ కి వెళ్లే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా.. బాలీవుడ్ నటుడు టాలీవుడ్ కి వస్తుంటే మనం అక్కడకి ఎందుకని ఎదురు ప్రశ్నించారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుందని.. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని అన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.