టాలీవుడ్ లో క్లిక్ అవ్వలేక బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది దిశా పటానీ. ప్రస్తుతం ఆమె 'మలంగ్' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. అనీల్ కపూర్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదల అయ్యాయి. వాటిలో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీకి సంబంధించిన ముద్దు సీన్ పోస్టర్ బాగా వైరల్ అయింది. ఈ పోస్టర్ లో ఆదిత్య భుజాలపై కూర్చుని మరీ అతనికి లిప్ లాక్ ఇస్తోంది. ఈ పోస్టర్ రిలీజైన తరువాత సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది.

ఆ సినిమాల విజయాలు బాహుబలి కంటే మిన్న

పోస్టర్ లోనే ఈ రేంజ్ రొమాన్స్ చూపించారంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందోననే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులు ఆశించినట్లుగానే పోస్టర్ లోనే కాకుండా సినిమాలో కూడా కొన్ని ముద్దు సీన్లు ఉన్నాయట. వాటిలో ఓ కిస్ సీన్ లో నటించడానికి హీరో, హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అండర్ వాటర్ లో ఓ కిస్ సీన్ ఉంటుందని. దాదాపు నిమిషం నిడివి ఉండే ఈ సీన్ లో నటించడానికి హీరో, హీరోయిన్లకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇప్పించారు. అంత సమయం పాటు అండర్ వాటర్ లో నటించడానికి వారి లంగ్ కెపాసిటీ పెంచడానికి ఈ ట్రైనింగ్ ఇప్పించారట.

సింగిల్ షాట్ లోనే ఈ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించారట. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ వంటి బ్లా్క్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు మోహిత్ సూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.