యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. వరుస వాయిదాలతో ఆటంకాలు ఎదుర్కొంటూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో జంటగా నటించారు. నిఖిల్ తన కెరీర్ లో విభిన్న కథలు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. 

అర్జున్ సురవరం చిత్రం జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ గా సాగుతుంది. తమిళంలో విజయం సాధించిన కణితన్ చిత్రానికి ఇది రీమేక్. వరుస వాయిదాలతో అర్జున్ సురవరం చిత్ర విడుదలకు ఏమాత్రం బజ్ లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి ప్రీరిలీజ్ కు హాజరు కావడంతో అర్జున్ సురవరంపై కొంత బజ్ ఏర్పడింది. 

తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలయింది. దర్శకుడు సంతోష్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఫలితంగా అర్జున్ సురవరం చిత్రం ఊహించినదానికంటే ఎక్కువగానే వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. 

48 ఏళ్ల టబుతో స్టార్ హీరో తమ్ముడు రొమాన్స్.. ఫస్ట్ లుక్ చూశారా!

ఇక వీకెండ్ ముగిసే సమయానికి అర్జున్ సురవరం చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.65 కోట్ల షేర్ రాబట్టింది. శనివారం రోజు కంటే ఆదివారం రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అధికంగా వసూళ్లు రాబట్టడం విశేషం. దీనితో అర్జున్ సురవరం చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్లకి సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

అల్లు అరవింద్ 1500 కోట్ల ప్రాజెక్ట్.. నో చెప్పిన రాంచరణ్, హృతిక్ రోషన్ ?

ఎన్నో అవాంతరాలని అధికమించి విడుదలైన అర్జున్ సురవరం మూవీ మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కూడా రాణిస్తుండడంతో హీరో నిఖిల్ కు రిలీఫ్ లభించినట్లు అయింది. నిఖిల్ తదుపరి కార్తికేయ సీక్వెల్ లో నటించనున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ విఐ ఆనంద్ దర్శత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాడు.