90వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టబు ఇప్పటికీ గ్లామర్ లుక్ తో యువతని ఆకర్షిస్తోంది. తెలుగుతో పాటు, హిందీలో కూడా టబు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 48ఏళ్ల వయసొచ్చినా వన్నె తరగని అందం ఆమె సొంతం. ఇదిలా ఉండగా టబు ప్రస్తుతం తన వయసుకు తగ్గట్లుగా పాత్రలు ఎంచుకుంటోంది. 

తెలుగులో టబు చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. ఇక బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాలు చేస్తోంది. బాలీవుడ్ క్రేజీ హీరోల్లో షాహిద్ కపూర్ ఒకరు. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కూడా హీరోగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

ఇప్పుడిప్పుడే ఇషాన్ ఖట్టర్ కు కూడా అవకాశాలు వస్తున్నాయి. కెరీర్ ఆరంభంలోనే ఇషాన్ ఖట్టర్ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. నవల ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎ సూటబుల్ బాయ్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో టబు కీలక పాత్రలో నటిస్తోంది. మ్యారేజ్ చుట్టూ ఈ కథ సాగుతుందట. 

అల్లు అరవింద్ 1500 కోట్ల ప్రాజెక్ట్.. నో చెప్పిన రాంచరణ్, హృతిక్ రోషన్ ?

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ఈ ఫస్ట్ లుక్ లో ఇషాన్ ఖట్టర్, టబుతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. టబు వయసు 48 ఏళ్ళు. ఇషాన్ ఖట్టర్ వయసు ఆమెలో సగం.. అంటే 24 ఏళ్ళు. ఇంత భారీ ఏజ్ గ్యాప్ ఉన్న వీరిద్దరి మధ్య రొమాన్స్ అంటే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారడం ఖాయం. ఈ వెబ్ సిరీస్ మొత్తం 1950 కాలం పరిస్థితులతో ఉంటుందట. వచ్చే ఏడాది ఈ వెబ్ సిరీస్ ని టెలికాస్ట్ చేయనున్నారు.