హీరో నిఖిల్ గౌడ గురించి వినే ఉంటారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడిగా, మాజీ సీఎం కుమారస్వామి తనయుడిగా నిఖిల్ వెండితెరకు పరిచయమయ్యాడు. నటుడిగా నిఖిల్ కి మంచి గుర్తింపే లభించింది. 30 ఏళ్ల ఈ యంగ్ హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 

నిఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రేవతిల వివాహం త్వరలో జరగాల్సి ఉంది. ఇటీవల ఫిబ్రవరిలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ పెళ్ళికి కరోనా వైరస్ రూపంలో చిక్కొచ్చి పడింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 100కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇక కర్ణాటక ప్రభుత్వం కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 31 వరకు సినిమా హాళ్లు, మ్యారేజ్ హాల్స్, షాపింగ్ మాల్స్ ని మూసివేయాలని ఆదేశాలు జరీ చేసింది. కుమారస్వామి తన కొడుకు పెళ్లిని కనీవినీ ఎరుగని విధంగా జరిపించడానికి రామనగరలో ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిమంది ప్రజలు, బంధుమిత్రులు, సెలెబ్రిటీల సమక్షంలో వివాహం జరిగిపించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. 

ఎన్టీఆర్, చరణ్ ఆకాశమే హద్దుగా.. మరొకడు దెబ్బతిన్న పులిలా.. వీళ్ల కోసం ప్రపంచం మొత్తం

కానీ ప్రస్తుతం కరోనా ప్రభావంతో అంత మంది జనం మధ్యలో పెళ్లి జరిపించడం వీలుకాదని అంటున్నారు. తాజా సమాచారం మేరకు పెళ్లి ఏర్పాట్లు కూడా ఆగిపోయాయని వినికిడి. ఇప్పటికి నిఖిల్, రేవతిల వివాహం రద్దు చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. త్వరలో కొత్త ముహూర్తం నిర్ణయించి బెంగుళూరులో కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో సింపుల్ గా వివాహం పూర్తి చేసే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కుమారస్వామి రెండుమూడు రోజుల్లో తన నిర్ణయం ప్రకటించనున్నారట.