ఎన్టీఆర్, చరణ్ ఆకాశమే హద్దుగా.. మరొకడు దెబ్బతిన్న పులిలా.. వీళ్ల కోసం ప్రపంచం మొత్తం

First Published 15, Mar 2020, 11:30 AM

2020-21 లో విడుదల కాబోతున్న ఈ చిత్రాల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 
RRR: రాజమౌళి తెరక్కిస్తున్న ఈ చిత్రం కోసం నిస్సందేహంగా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది అని చెప్పొచ్చు. బాహుబలితో రాజమౌలికి చైనా, జపాన్ లాంటి దేశాల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఇక ఇండియాలో ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. జనవరి 8, 2021న ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.

ఇండియన్ 2: డైరెక్టర్ శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్ వాళ్లకు ధీటుగా మన చిత్రాలు ఉండాలి అని తపనపడే దర్శకుడు. కమల్ హాసన్, శంకర్ లకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరిద్దరి కాంబోలో ఇండియన్ 2 చిత్రం తెరక్కుతోంది.ఇటీవల షూటింగ్ లో జరిగిన ప్రమాదం వల్ల ప్రస్తుతం చిత్ర యూనిట్ నిరాశలో ఉంది.

TENET: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం టెనెట్. దాదాపు 200 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరక్కుతోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు టెనెట్ మూవీ ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో. జులై 17న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

KGF 2: కన్నడ సినీ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం కెజిఎఫ్. యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో కేజిఎఫ్ 2 సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 23న రిలీజ్ చేస్తున్నారు.

అవతార్ 2: ప్రపంచంలోనే అగ్ర దర్శకులలో జేమ్స్ కామెరూన్ ఒకరు. కామెరూన్ తెరకెక్కించిన అవతార్ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. ఆ రికార్డుని ఎవెంజర్స్ ఎండ్ గేమ్ బద్దలు కొట్టింది. అవతార్ 2 కోసం ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

లాల్ సింగ్ చద్దా : అమీర్ ఖాన్ ప్రస్తుతం దెబ్బ తిన్న పులి. అమిర్ చివరగా నటించిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ భారీ డిజాస్టర్. అమిర్ ఖాన్ ఫ్లాఫ్ ఎదురైనా ప్రతిసారి దెబ్బతిన్న పులిలా భారీ హిట్ కొడుతూ వచ్చాడు. దీనితో లాల్ సింగ్ చద్దా పై కూడా అంచనాలు ఉన్నాయి.

83: అనేక దేశాల్లో క్రికెట్ కు ఆదరణ ఉంది. ఇండియన్ క్రికెట్ లెజెండ్ గా కపిల్ దేవ్ గురించి అందరికి తెలుసు. 1983 ప్రపంచ కప్ విన్నింగ్ మూమెంట్స్, కపిల్ జీవిత చరిత్ర ఆధారంగా 83 చిత్రం తెరకెక్కుతోంది.

క్రిష్ 4: ఇండియాలో విజయవంతం అవుతోన్న ఏకమైన సూపర్ హీరో ప్రాంచైజీ క్రిష్. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కావచ్చు.

PSPK27: పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం వకీల్ సాబ్. కానీ ఈ చిత్రం కంటే ఎక్కువగా అభిమానులు క్రిష్ దర్శత్వంలో తెరక్కుతున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా పవన్ కెరీర్ లోనే అత్యధికంగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

నో టైం టు డై : ఇక జేమ్స్ బాండ్ చిత్రాలకు కూడా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. జేమ్స్ బాండ్ సిరీస్ నుంచి వస్తున్న మరో చిత్రం 'నో టైం టూ డై'.

loader