నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఒక దశలో నటుడు పోసాని, దర్శకుడికి మధ్య పెద్ద గొడవ జరిగిన విషయాన్ని నిఖిల్ బయటపెట్టాడు.

'అర్జున్ సురవరం' సినిమా షూటింగ్ సమయంలో ఎప్పుడూ టెన్షన్ పడలేదు కానీ ఒకసారి బాగా టెన్షన్ పడినట్లు ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. పోసాని గారితో వర్క్ చేస్తున్నప్పుడు.. డైరెక్టర్ కి, పోసానికి మధ్య గొడవ జరిగిందని.. పోసాని ఏ సీన్ చేసినా.. రెండు, మూడు టేకుల్లో ఓకే అయిపోతుందని.. డైరెక్టర్ మాత్రం 16-17 టేకులు చేయించారని.. దీంతో పోసానికి కోపం వచ్చి దూరంగా వెళ్లిపోయారని చెప్పారు.

బాహుబలి రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్న పాత సినిమాలు (1933 - 86)

వెంటనే డైరెక్టర్ పోసాని దగ్గరకి వెళ్లి తను ఫస్ట్ టైం డైరెక్టర్ అని.. కొంచెం సహాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో అప్పుడు పోసాని గారు మళ్లీ సెట్స్ పైకి వచ్చి లేట్ నైట్ వరకు ఉండి ఆ సీన్ చేశారని వెల్లడించారు. షూటింగ్ మొత్తంలో తనను కాస్త టెన్షన్ కి గురిచేసిన ఘటన అది మాత్రమేనని చెప్పుకొచ్చాడు నిఖిల్.

ఇక చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడం గురించి మాట్లాడుతూ.. చిరంజీవి వచ్చి తనను ఓ కుటుంబ సభ్యుడిలా ట్రీట్ చేయడం త్రిల్ అనిపించిందని చెప్పారు. ఆయన గొప్ప వ్యక్తి అని.. ఆయన గొప్పదనం గురించి తెలియాలంటే ఆయన్ని దగ్గర నుండి చూడాల్సిందేనని చెప్పారు. సినిమా రిలీజ్ ఎవ్వలేదంటే అందరూ సానుభూతి చూపిస్తారని.. హెల్ప్ చేసేది తక్కువ అని.. కానీ చిరంజీవి ఏమీ ఆశించకుండా వచ్చి సహాయం చేశారని తెలిపాడు.