టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ నలభైకి పైగా చిత్రాల్లో నటించారు. తన కెరీర్ లో కొన్ని హిట్లు ఉన్నప్పటికీ హీరోగా స్టార్ హోదాని మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ హీరో 'అల.. వైకుంఠపురములో' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో నవదీప్ పై కొన్ని రూమర్లు వినిపించేవి. ఏ హీరో మీద రాని ఒకరకమైన రూమర్స్ హల్చల్ చేసేవి.

నవదీప్ గే అని అతడికి అమ్మాయిలకంటే అబ్బాయిలే బాగా నచ్చుతారని ఇలా రకరకాలుగా మాట్లాడుకునేవారు. తాజాగా ఈ విషయంపై నవదీప్ స్పందించాడు. ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు నవదీప్. 'సినిమాల్లోకి వచ్చిన తరువాత మీపై వచ్చిన పెద్ద రూమర్' ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. దానికి నవదీప్.. తను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బాగా డబ్బున్న వాడిననే ప్రచారం జరిగిందని.. వీడికి బాగా పొగరెక్కువ అనుకునేవారని చెప్పుకొచ్చాడు. 

అదే కాకుండా.. తనకు అబ్బాయిలంటే ఎక్కువ ఇష్టం అని 'గే' రూమర్ క్రియేట్ చేశారని చెప్పారు. ఆ సమయంలో ఎవడో వచ్చి 'మీకు అబ్బాయిలంటే ఇష్టమట కదా..' అని అడిగాడని.. వాడికి ఏం చెప్పాలో అర్ధం కాలేదని నవదీప్ అన్నారు. కాదు అని చెప్పినా వాడు నమ్మడని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడని అప్పటి సంఘటన గుర్తు చేసుకున్నాడు. అలానే తను అమెరికా ఉండగా ఓ వ్యక్తి చాట్ చేశాడట.

వారి మధ్య జరిగిన సంభాషణ నవదీప్ మాటల్లో.. ''యూఎస్ లో ఉన్నప్పుడు ఒకరు నాతో చాట్ చేశారు. నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఒకటి అడుగుతా అన్నాడు. వీడేం అడుగుతాడురా బాబు అని.. సరే చెప్పు అని అన్నాను. ఏం లేదు నాకు ఆ నిజం తెలుసు.. మీరు ఒప్పుకోరని కూడా తెలుసు.. అని చెప్పి మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టం అంట కదా.. నేను అంతేనండి అని'' అన్నాడని నవదీప్ తను ఫేస్ చేసిన పరిస్థితిని వెల్లడించాడు. నీ ఫీలింగ్స్ తో నాకు పని లేదని వాడికో దండం పెట్టానని నవదీప్ చెప్పుకొచ్చాడు. అసలు 'గే'లు సినిమాలో చూపించినట్లు ఉండరని, వాళ్ల లైఫ్ వాళ్లదని అన్నారు.  

 

పెళ్లైన స్త్రీతో బ్రహ్మాజీ వివాహం.. భార్య కొడునే తన కొడుకుగా!