హీరో మంచు విష్ణుకి స్టీల్ ప్లాంట్ నిరసన సెగ తగిలింది. తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా విశాఖ వెళ్లిన విష్ణును నోవాటెల్ వద్ద అడ్డుకున్నారు నిరసనకారులు. స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్ధతివ్వాలని వినతి పత్రం అందజేశారు ఉద్యోగులు, నిరసన కారులు.

సినీ ప్రముఖులు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని కార్మికులు తెగేసి చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి టాలీవుడ్ మద్ధతు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన మంచి విష్ణు ప్రైవేట్ వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు, ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.

Also Read:విశాఖ ఉక్కు ఉద్యమంపై ఎందుకు మాట్లాడొద్దు: బీజేపీపై కేటీఆర్ ఫైర్

విశాఖ ఉద్యమానికి మద్ధతు తెలపాలని సినీ ప్రముఖులకు  వున్నా.. రాజకీయ కారణాల వల్ల ముందుకు రాలేకపోతున్నారని విష్ణు పేర్కొన్నారు. సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.

కాగా విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించారు. సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ లిస్ట్‌లో వున్నారు.