విశాఖపట్టణం: విశాఖ ఉక్కు ఉద్యమంపై ఎందుకు మాట్లాడకూడదో చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ లను ప్రశ్నించారు. 

విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించడంపై ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు స్పందించారు.తెలంగాణ వికాస సమితి హైద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. అవసరమైతే విశాఖకు వెళ్లి కార్మికులకు మద్దతు తెలుపుతానని ఆయన ప్రకటించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కష్టం వస్తే మేం మాట్లాడితే బీజేపీకి ఎందకు బాధ అని ఆయన ప్రశ్నించారు. మాకు కష్టం వస్తే ఎవరు మద్దతిస్తారని ఆయన అడిగారు. .
సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.

also read:ఉద్యోగులపై ఆకస్మాత్తుగా ప్రేమ ఎందుకొచ్చింది:కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఫైర్

తెలంగాణకు బయ్యారం ఉక్కు ఇస్తామని ఇచ్చిన హమీని కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. బయ్యారం ఉక్కు సంగతి దేవుడెరుగు... ఉన్న విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని ఆయన విమర్శించారు.

విశాఖ ఉక్కు గురించి మాట్లాడితే మాకెందుకని ప్రశ్నిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంటే మాట్లాడొద్దా ,చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఉందో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.