టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలనీ గత కొంత కాలంగా బాలీవుడ్ కి చెందిన చాలా మంచి బడా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ రిస్క్ చేయకూడదని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్ ప్రభాస్ డేట్స్ ఇస్తే ఉదయాన్నే షూటింగ్ స్టార్ట్ చేయడానికి కథలను కూడా సిద్ధం చేసి ఉంచాడు.

 బాహుబలి విజయంలో కరణ్ జోహార్ పాత్ర ఎంతో ఉంది. వరల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేయించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అందుకే కరణ్ తో తప్పకుండా సినిమా చేయాలనీ ప్రభాస్ ముందు నుంచి ఆలోచిస్తున్నాడు. కానీ సౌత్ నార్త్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే యూనివర్సల్ పాయింట్ ఉన్న కథనే చేస్తానని ప్రభాస్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు.

అలాంటి కథను సెట్ చేయడంలో కరణ్ జోహార్ విఫలమవుతున్నాడు. ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రభాస్ కోసం ఒక స్ట్రాంగ్ లైన్ చెప్పినట్లు టాక్ వచ్చింది.  కథలో కొన్ని మార్పులు అవసరమని చెప్పడంతో సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ని కమర్షియల్ ఫార్మాట్ లో డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ కథ సెట్టయితే సురేందర్ రెడ్డి - కరణ్ జోహార్ కాంబినేషన్ ని సెట్స్ పైకి తీసుకురావాలని ప్రభాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. 2020లో ప్రభాస్ తో ఎలాగైనా ఒక మంచి సినిమా చేయాలనీ కరణ్ జోహార్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. మరి ఆయన ప్లాన్స్ ఎంతవరకు సెట్టవుతుందో చూడాలి.