సైరా లాంటి భారీ బడ్జెట్ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శత్వంలో నటిస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడు. ఆయన తెరకెక్కించిన నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీనితో ఆచార్యపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొన్నాయి. 

ఇక ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సంప్రదింపులు జరిపారు. దాదాపుగా మహేష్ ఖాయం అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో రెమ్యునరేషన్ వ్యవహారం తేలకపోవడంతో మహేష్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మహేష్ బాబు భారీ స్థాయిలో 30 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం 20 నిమిషాల పాత్ర కోసం 30 కోట్లు అంటే కష్టమే అనే అభిప్రాయానికి చిత్ర యూనిట్ వచ్చిందట. దీనివల్ల బడ్జెట్ కూడానా పరిధి దాటిపోతుంది.. సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించడంతో ఆచార్య చిత్రయూనిట్ కూడా మహేష్ తో బేరసారాలు విరమించుకున్నట్లు టాక్. 

'నీ కళ్ళకు అందరు అమ్మాయిలు అందంగానే ఉంటారు'.. అనుష్కపై పూరి భార్య కామెంట్స్!

దీనితో వీలైనంత మేరకు రామ్ చరణ్ నే నటింపజేయాలని.. హోమ్ ప్రొడక్షన్ కాబట్టి బడ్జెట్ కూడా కలసి వస్తుందని దర్శకుడు కొరటాల భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తుది నిర్ణయం ఏంటో మెగా కాంపౌండ్ నుంచే రావాలి. 

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మణిశర్మ చిరంజీవి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.