ఈ మధ్యకాలంలో చాలా మంది హాలీవుడ్ స్టార్లను టాలీవుడ్ కి తీసుకొస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఒకప్పటి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ని టాలీవుడ్ కి పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ మంచి హిట్ ని అందుకున్నాడు.

ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

'రూలర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య క్రేజ్ మాములుగా లేదు!

ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలనేది పూరి ప్లాన్. ఇప్పటికే విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' చిత్రంతో బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. అలానే 'నోటా' సినిమాతో ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా పరిచయమయ్యాడు. అందుకే ఇప్పుడు విజయ్ దేవరకొండ మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు పూరి జగన్నాథ్.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమా హిందీ వెర్షన్ ని విడుదల చేయడానికి అంగీకరించారు. అంతేకాదు.. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క సినిమాలో పవర్ ఫుల్ విలన్ కోసం చూస్తున్నారు. ఈ రోల్ లో ఒకప్పటి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ని తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.

మైక్ టైసన్ లాంటి నటుడిని టాలీవుడ్ కి తీసుకురావడం అంత ఈజీ కాదు కానీ కరణ్ జోహార్, పూరి ప్రయత్నిస్తే వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి నిజంగానే మైక్ టైసన్ గనుక ఒప్పుకుంటే ఈ సినిమా మరో రేంజ్ కి వెళ్లడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా షూటింగ్ తో బిజీగా గడుపుతున్నాడు.