విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటించిన చిత్రం వెంకీ మామ. దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ మల్టి స్టారర్ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షుకులు ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని జోరుగా నిర్వహిస్తోంది. మంగళవారం రోజు హైదరాబాద్ లో వెంకీ మామ మ్యూజికల్ నైట్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాఘవేంద్ర రావు ప్రసంగించే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. తనకు రామానాయుడుగారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకటేష్, చైతన్యతో ఓ చిత్రం చేయాలని ఆయన ఉన్నప్పుడు ఎన్నోసార్లు తనతో అన్నారని రాఘవేంద్ర రావు తెలిపారు. 

రామానాయుడుగారు ఎంతో ఇష్టపడిన కాంబినేషన్ ఇది. ఈ చిత్రం పూర్తయ్యే సరికి అయన మనమధ్య లేకపోవడం బాధాకరం. అన్నమయ్య చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పుడు మా నాన్నగారు ఉన్నారు. కానీ విడుదలయ్యే సమయానికి ఆయన లేరు. 

వెంకీమామ మ్యూజికల్ నైట్: రాశి ఖన్నా, పాయల్ గ్లామర్ మెరుపులు.. ఫొటోస్

అన్నమయ్య చిత్రం రిలీజ్ రోజున.. మా నాన్న ఫోటో దగ్గరకు వెళ్లి ఏడ్చా.. ఈ ఒక్క సినిమా మీరు చూసి ఉంటే బావుండేదని కోరుకున్నా అని అన్నారు. ఈ క్రమంలో రాఘవేంద్ర రావు తన తండ్రి సూర్య ప్రకాష్ రావు గారిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. దీనితో పక్కనే ఉన్న రానా దగ్గుబాటి రాఘవేంద్ర రావుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో సురేష్ బాబు, వెంకటేష్ కూడా భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. 

మీరు కూడా వెంకిమామ చిత్రం రిలీజ్ రోజున రామానాయుడుగారి ఫోటోకు దండం పెట్టుకోండి అని దగ్గుబాటి ఫ్యామిలీకి సూచించారు. రామనాయుడిగారివల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని రాఘవేంద్ర రావు అన్నారు.