దర్శకుడు హరీష్ శంకర్ తన సినిమాలతో పాటు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూంటాడు. మొన్నామధ్య క్రిస్టియన్ సాంగ్స్ గురించి ఆయన చేసిన ట్వీట్ దుమారాన్ని రేపింది. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. 

"నేనూ గెలవాలి ....All the Best
నేను గెలవాలి .... Ok..... 
నేనే గెలవాలి .... Sorry Boss....'' 

ఇదీ హరీష్ శంకర్ పెట్టిన ట్వీట్. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టాడా..? అనేది మాత్రం తెలియడం లేదు. ఎక్కువమంది మాత్రం ఈ ట్వీట్ సంక్రాంతి ఫేక్ కలెక్షన్లను ఉద్దేశించి వేసిన సెటైర్ అని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ పంచ్ మహేష్ బాబు సినిమాపై అని అనుకోని.. సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

మీకు అర్దమౌతోందా... ‘సరిలేరు..’ టీమ్ కొత్త స్కెచ్!

మహేష్ ఫ్యాన్స్ ఏమో.. బన్నీపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ ట్వీట్ కింద ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది మాత్రం అసలు ఈ ట్వీట్ అర్ధమేంటని అడుగుతున్నారు. ఏదైతేనేం.. హరీష్ శంకర్ ట్వీట్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.