గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ 28వ చిత్రానికి కథని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. 

ఇదిలా ఉండగా పవన్ మూవీ తర్వాత హరీష్ శంకర్ తెరకెక్కించే మరో చిత్రం కూడా ఖరారైంది. హరీష్ శంకర్ చివరగా గద్దలకొండ గణేష్ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కించారు. గద్దలకొండ గణేష్ తర్వాత మరోసారి హరీష్ శంకర్ తో పనిచేయనున్నామని, అందుకు సంతోషంగా ఉందని ఆ సంస్థ ప్రకటించింది. 

రాత్రికి పడుకునేందుకు హీరో ఒప్పుకున్నాడా.. నిర్మాతతో హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలని లాక్ డౌన్ తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీనితో హరీష్ శంకర్ తెరకెక్కించబోయే ఆ చిత్రం గురించి లీకులు మొదలైపోయాయి. హరీష్ శంకర్ చాలా కాలంగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. 

గతంలో నితిన్, శర్వానంద్ లతో చర్చలు కూడా జరిగాయి. కానీ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు ఆ కథని పట్టాలెక్కించి భాద్యత 14 రీల్స్ ప్లస్ సంస్థ తీసుకుంది. నితిన్ ఆల్రెడీ హీరోగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరో హీరో పాత్ర కోసం సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి క్లారిటీ రానుంది.