కాస్టింగ్ కౌచ్ ఉందంతాలు చిత్ర పరిశ్రమలో తవ్వేకొద్దీ బయట పడుతూనే ఉన్నాయి. చాలా మంది నటీమణులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అవకాశాలని ఎరగా వేసి వారిని కొందరు నిర్మాతలు, దర్శకులు లోబరుచుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఇండియాలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సంగతి తెలిసిందే. 

తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమం ప్రారంభించడంతో చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపులని ధైర్యంగా బయటపెట్టారు. ఇప్పటికీ కొందరు నటీమణులు తమకు ఎదురైనా కాస్టింగ్ కౌచ్ సంఘటనలని బయట పెడుతున్నారు. 

తాజాగా మరాఠీ హీరోయిన్ శృతి మరాఠీ సంచలన  వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ నిర్మాత తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరుని వివరించింది. ఓ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఓ నిర్మాత నన్ను పిలిచారు. మొదట అతడు సినిమా గురించి వివరిస్తూ బాగానే మాట్లాడాడు. 

మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ గా డిస్కషన్ బాగానే జరిగింది. అంతా ఓకె అయింది. కానీ చివర్లోనే అతడు తన వక్ర బుద్ధిని బయట పెట్టాడు. నువ్వు కాంప్రమైజ్ కావాలి. ఒక రాత్రికి పడుకుంటే చాలు.. ఈ ఆఫర్ నీదే అని చెప్పాడు. దీనితో అతడికి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం ఇచ్చానని శృతి మరాఠీ తెలిపింది. 

'నా సంగతి పక్కన పెట్టు.. హీరో కూడా నీతో పడుకోవడానికి ఒప్పుకున్నాడా.. ఎవరా హీరో.. అంటే ఈ చిత్రంలో నటించే మగాళ్లతో కూడా పడుకుంటావా అని అడిగా'. దీనితో ఆ నిర్మాత తెల్లముఖం పెట్టుకున్నాడు అని శృతి చెప్పుకొచ్చింది. ఆ నిర్మాత అలా అడిగినందుకు నాకు భాదగా లేదు. అలాంటి వారు చాలానే ఉన్నారు. వారందరిని ఎదుర్కొనాలంటే బాధపడితే సరిపోదు. ధైర్యం కావాలి అని శృతి చెప్పుకొచ్చింది.