Asianet News TeluguAsianet News Telugu

హోలీ స్పెషల్.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ వైరల్!

స్టార్ హీరోలు షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ ని ఏ మాత్రం మిస్సవ్వరు అనేది అందరికి తెలిసిన విషయమే. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. కాస్త గ్యాప్ దొరికింది అంటే చాలు తారక్ తన ఫ్యామిలీతో హాలిడేస్ కి వెళ్తుంటాడు.

jr ntr holi celebrations with family
Author
Hyderabad, First Published Mar 10, 2020, 11:41 AM IST

టాలీవుడ్ లో కొంత మంది స్టార్ హీరోలు షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ ని ఏ మాత్రం మిస్సవ్వరు అనేది అందరికి తెలిసిన విషయమే. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. కాస్త గ్యాప్ దొరికింది అంటే చాలు తారక్ తన ఫ్యామిలీతో హాలిడేస్ కి వెళ్తుంటాడు. ఇక ఈ సారి హోలీ సెలబ్రేషన్స్ ని తన ఇంటిదగ్గరే పిల్లలతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

jr ntr holi celebrations with family

హోలీ సందర్భంగా భార్య ప్రణతి కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి దిగిన సెల్ఫీ  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా రోజులతో నందమూరి వారసులను సోషల్ మీడియాలో ఒకే ఫ్రేమ్ లో చూడటంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవల తారక్ రెమ్యునరేషన్ గురించి అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. కమర్షియల్ హిట్స్ తో తన మార్కెట్ ను పెంచుకుంటున్న తారక్ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. అరవింద సమేత వరకు 20కోట్ల లోపే తీసుకున్న తారక్ ఇప్పుడు ఆ నెంబర్ ని డబుల్ చేయాలనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ అరవింద సమేత అనంతరం రెండేళ్ల పాటు వెండి తెరకు దూరమవుతున్న తారక్ నెక్స్ట్ ఇయర్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ మల్టి స్టారర్ RRR సినిమా అయిపోగానే నెక్స్ట్ త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్నాడు. RRR కు 25కోట్లు ఛార్జ్ చేస్తున్న తారక్ ఆ తరువాత సినిమా నుంచి 40కోట్లకు తీసుకునే అవకాశం ఉందట. ఎందుకంటె ఆ బిగ్ మల్టీస్టారర్ తో తారక్ రేంజ్ నేషనల్ వైడ్ గా తప్పకుండా పెరుగుతుందనే చెప్పవచ్చు. దీంతో త్రివిక్రమ్ సినిమా మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తారక్ కూడా రెమ్యునరేషన్ డోస్ పెంచాలని అనుకుంటున్నాడట.

ఇక త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టు పై రీసెంట్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అల.. వైకుంఠపురములో సినిమాతో స్ట్రాంగ్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు అదే తరహాలో తారక్ తో కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమాలను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ కి జతగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా కలిసింది. త్రివిక్రమ్ సినిమాను కళ్యాణ్ రామ్ చినబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios