టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. కేవలం సినిమా విషయాలే కాదు.. అనేక సామజిక అంశాల గురించి కూడా స్పందిస్తుంటారు. డ్రైనేజి సమస్యలు వచ్చినా, ఇతర సంఘటనలు జరిగినా హరీష్ శంకర్ ఆ విషయాలని సోషల్ మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతుంటారు. 

తాజాగా హరీష్ శంకర్ ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ అలీ బాబా గ్రూప్ పై మండిపడ్డాడు. అలీబాబా బిల్లింగ్ విధానాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశాడు. హరీష్ శంకర్ ఆర్డర్ చేసిన ఓ ప్రోడక్ట్ కు విచిత్రంగా బిల్లింగ్ వచ్చింది. 

అమ్మాయితో జడ్జి బూతులు.. ఆ టైంలో ఎన్టీఆర్ సీఎం.. నటి కిన్నెరపై సంచలన వ్యాఖ్యలు

'ప్రోడక్ట్ ధర రూ.5,608.. కానీ షిప్పింగ్ ఛార్జీ మాత్రం రూ. 8,801.. డియర్ అలీబాబా గ్రూప్ అసలు మీ సంస్థ ఎలా పనిచేస్తుందో కొంచెం వివరిస్తారా.. జస్ట్ ఆస్కింగ్' అంటూ హరీష్ శంకర్ సుతిమెత్తంగా ఆ సంస్థకు కౌంటర్ ఇచ్చాడు. 

స్టన్నింగ్ హాట్.. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ ఫోజులు

హరీష్ ట్వీట్ పై ఆ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే హరీష్ చివరగా గద్దలకొండ గణేష్ లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించారు. ప్రస్తుతం హరీష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.