పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా మారిపోతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో పాటు క్రిష్ దర్శత్వంలో విరూపాక్ష అనే చిత్రంలో కూడా పవన్ నటిస్తున్నాడు. అలాగే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శత్వంలో పవన్ మరో చిత్రానికి ఓకె చెప్పిన సంగతి తెలిసిందే. 

తాజాగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ 28వ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. గబ్బర్ సింగ్ చిత్రానికి సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాదే.. పవన్ 28వ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నట్లు హరీష్ శంకర్ ట్విట్టర్ లో ప్రకటించారు. 

'ఇప్పుడే మొదలైంది'.. బండ్ల గణేష్ ఎక్కడ.. వివాదంలో హరీష్ శంకర్

గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై 8 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేయడానికి ఇంతకంటే మంచి రోజు లేదు. మరోసారి అలాంటి మ్యూజిక్ మ్యాజిక్ చేసేందుకు మీ ముందుకు రాబోతున్నాం. PSPK28 చిత్రానికి కూడానా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు అని హరీష్ ప్రకటించారు. 

గబ్బర్ సింగ్ చిత్రానికి దేవిశ్రీ ఎనర్జిటిక్ ఆల్బమ్ అందించాడు. గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటలు సినీ ప్రియులని ఉర్రూతలూగించాయి. మరి రెండవసారి గబ్బర్ సింగ్ కాంబోలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.