సినిమాని కమర్షియల్ గా వర్కౌట్ చేయడంలో హరీష్ శంకర్ స్టయిలే వేరు. మిరపకాయ్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్న హరీష్.. గబ్బర్ సింగ్ చిత్రంతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. సరైన చిత్రం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు గబ్బర్ సింగ్ ద్వారా హరీష్ ట్రీట్ ఇచ్చాడు. 

పవన్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించాడు. ఫలితంగా కమర్షియల్ చిత్రాల్లో గబ్బర్ సింగ్ మూవీ ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది. ఈ చిత్రంలో పవన్ సరసన అందాల తార శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాస రావు, అజయ్, అభిమన్యు సింగ్, తనికెళ్ళ భరణి ఇతర కీలక పాత్రలో నటించారు. 

ఈ చిత్రం విడుదలై 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఈ చిత్ర విజయంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ నిన్న మొన్ననే జరిగిన ఫీలింగ్ తనకు ఉందని హరీష్ తెలిపాడు. 

సోషల్ మీడియా వల్ల గబ్బర్ సింగ్ చిత్ర జ్ఞాపకాలు జ్ఞాపకాలు ప్రతి సంవత్సరం తనతోనే ఉంటున్నాయని హరీష్ అన్నారు. ఈ చిత్రంలో ఆన్ స్క్రీన్ హీరో పవర్ స్టార్ అయితే ఆఫ్ స్రీన్ హీరో దేవిశ్రీగా అభివర్ణించారు. ఈ చిత్రం విడుదలై 8 ఏళ్ళు గడచిపోయిందా అనే ఆశ్చర్యంతో పాటు.. పవర్ స్టార్ తో పనిచేసి 8 ఏళ్ళు గడచిపోయిందా అనే ఆందోనళ  కూడా ఉందని అన్నారు. 

ఈ చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్, ఎడిటర్ గౌతమ్ రాజు, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లకు హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. తన లేఖ చివర్లో పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా హరీష్ ఓ వ్యాఖ్య చేసాడు. 

ఇప్పుడే మొదలైంది.. మేము మళ్ళీ తిరిగొస్తున్నాం అని తెలిపారు. గబ్బర్ సింగ్ చిత్రానికి సంబందించిన ప్రతి ఒక్కరి పేరు  ప్రస్తావించిన హరీష్ శంకర్.. నిర్మాత బండ్ల గణేష్ ని విస్మరించడం అనుమానాలకు కారణమైంది. దీనితో హరీష్.. బండ్ల గణేష్ పేరుని ఎందుకు ప్రస్తావించలేదు అనే చర్చ జరుగుతోంది. 

త్వరలో హరీష్ మరోసారి పవన్ ని డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ నిర్మాణంలో పవన్ 28 వ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం హరీష్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు.