రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్తగా ట్రై చేయడం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇష్టం. కానీ అతడి ఫ్యాన్స్ మాత్రం అతడినే స్టైలిష్ గానే చూడాలనుకుంటారు. 'నా పేరు సూర్య' సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్ ట్రై చేసినప్పటికీ వర్కవుట్ అవ్వలేదు.

గతంలో అతడు నటించిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు చేసినప్పుడు బన్నీ.. స్టైలిష్ అండ్ క్యాజువల్ గా కనిపించాడు. ఆ రెండు సినిమాలు కూడా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినవే.. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'అల.. వైకుంఠపురములో' సినిమాలో కూడా బన్నీ తన పాత లుక్ ని వదల్లేదు.

అల్లు అర్జున్ ని ఆగం చేసిందట.. కేక పెట్టిస్తున్న 'రాములో రాములా' సాంగ్ టీజర్!

ఇప్పటికే ఈ సినిమానుండి రెండు పాటలు వచ్చాయి. మొదటిపాట 'సామజవరగమన'లో బన్నీ చాలా క్యాజువల్ లుక్ లో కనిపించాడు. నిన్న విడుదలైన రెండో పాట 'రాములో రాములా' సాంగ్ టీజర్ లో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. 

దీంతో ఈ టీజర్ బాగా వైరల్ అవుతోంది. బన్నీ ఫ్యాన్స్ కి ఇష్టమైన స్టైలిష్ లుక్, డాన్స్ తో కూడి ఉన్న ఈ మాస్ సాంగ్ ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తోంది. ఇప్పటివరకు యూట్యూబ్ లో మూడు మిలియన్లకు పైగా వ్యూస్ ని దక్కించుకుంది. పాట పూర్తిగా విడుదల చేయకుండానే.. కేవలం సాంగ్ టీజర్ తో ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు..

మొత్తానికి రెండు పాటలతో 'అల.. వైకుంఠపురములో' సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సుశాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.