ప్రభాస్ నేడు 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు విషెస్ అందిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. నిన్న ప్రభాస్ కి సంబందించిన ఒక స్పెషల్ ఫోటోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

ఆ ఫోటో రెబల్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. రాత్రి నుంచి ఇంటర్నెట్ లో హ్యాపీ బర్త్ డే ప్రభాస్ ట్యాగ్  వైరల్ అయ్యింది.  అయితే ప్రభాస్ పుట్టినరోజూ సందర్బంగా నేడు ఆయన నెక్స్ట్ సినిమాకు సంబందించిన లుక్ ని ఏమైనా వదులుతారా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఇటీవల సాహో సినిమాతో ప్రభాస్ సౌత్ ఆడియెన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు. కానీ బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రం సాహో సినిమాకు ఫిదా అయ్యారు.

also read:ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. టాప్ బాక్స్ ఆఫీస్ హిట్స్

ఇక నెక్స్ట్ సినిమా జాన్ తో అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించే విధంగా ప్రభాస్ సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ లో మొదలుకానుంది. ప్రభాస్ తన 40వ బర్త్ డే పార్టీని స్నేహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేయనున్నాడు. అయితే టూర్ అనంతరం జాన్ సినిమాను మొదలుపెట్టాలని డిసైడ్ అయినా ప్రభాస్ ఒక ఛాలెంజ్ ని ఎదుర్కోబోతున్నాడు.  

సినిమా కథ ప్రకారం ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించబోతున్నాడు. అంటే మొదటి పాత్రకు రెండవ పాత్రకు ఏ మాత్రం సంబంధం ఉండకూడదట. అందుకే దర్శకుడి ఆలోచన ప్రకారం ప్రభాస్ బరువు తగ్గేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. నెవర్ బిఫోర్ అనే విధంగా ఒక లుక్ తో అభిమానులకు సరికొత్త కిక్ ఇవ్వాలని కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.  

మరి ఆ కొత్త లుక్ ప్రభాస్ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఈ సినిమాలో పూజా హెగ్డే  నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మరొక బాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.