దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన బ్యూటీ హన్సికా మోత్వానీ. మొదటి సినిమాతోనే గ్లామర్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మిల్కీ బ్యూటీ కెరీర్ లో ఇంకా అనుకున్నంత స్థాయికి చేరుకోవడం లేదు. ఇంకా మీడియం హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

హన్సిక సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది.  స్టార్ హీరోలతో అవకాశాలు రాకాపోయినా బేబీ వచ్చిన ఆఫర్స్ కి నో చెప్పకుండా సైలెంట్ గా ముందుకు సాగుతోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల హన్సిక ఓ బంపర్ అఫర్ ని కొట్టేసింది.

హాట్ హీరోయిన్స్ @30 ..  పాతబడినా కూడా గ్లామర్ డోస్ తగ్గడం లేదు

10కోట్ల విలువైన కారును బహుమతిగా అందుకుంది. ఆ గిఫ్ట్ ఇచ్చింది మరెవరో కాదు. ఆమె తల్లి మనో మొత్వాని. గతకొన్నాళ్ళుగా కూతురికి మర్చిపోలేని ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పిన మానో మోత్వానీ ఎట్టకేలకు రోల్స్ రాయిస్ కారును బహుమతిగా అందించారు.  హన్సిక బహుమతి అందుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక బేబీ సినిమాల విషయానికి వస్తే.. ఎవరు ఊహించని విధంగా మరో లేడి ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ తో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. హన్సిక ప్రధాన పాత్రలోకనిపించనున్న ఆ వెబ్ సిరీస్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

హన్సిక పాత్రలో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. గ్లామర్ ని ప్రజెంట్ చేయడంతో పాటు తనలోని సరికొత్త నటిని ఆవిష్కరించే విధంగా వెబ్ సిరీస్ రూపొందుతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక వివరణ ఇచ్చింది. పిల్ల జమిందార్ - భాగమతి సినిమాల దర్శకుడు అశోక్ ఆ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.