ఇప్పుడందరూ వెబ్ సీరిస్ ల మీద పడ్డారు. స్టార్ డైరక్టర్స్ సైతం వెబ్ సీరిస్ లు ప్లాన్ చేస్తూంటే...మేము మాత్రం ఏం తక్కువ అంటూ అందులో నటించటానికి స్టార్ హీరోయిన్స్, హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. బాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు తెలుగుకీ పాకింది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ఓ వెబ్ సీరిస్ లో నటిస్తూండగా...హన్సిక కూడా ఓ వెబ్ సీరిస్ కమిటైంది.

అయితే ఈ వెబ్ సీరిస్ కాస్త అడల్ట్ కంటంట్ ని బేస్ చేసుకునే సాగుతుందని వినికిడి. హన్సిక ఈ సీరిస్ లో లిప్ లాక్ కిస్ లు, స్కిన్ షో కు వెనకాడకుండా ముందుకు వెల్తుందని అంటన్నారు. భవిష్యత్  వెబ్ సీరిస్ దే అని చెప్తున్న హన్సిక ఇప్పటికే ఈ వెబ్ సీరిస్ కు సంభందించి షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసిందిట. కేవలం నాలుగు రోజులు షూటింగ్ మాత్రమే మిగిలిందని చెప్తోంది.

ప్రభాస్ వదులుకున్న సినిమాలు.. ఆ హీరోలకు బ్లాక్ బస్టర్లు

అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు అశోక్ ఈ వెబ్ సీరీస్ రూపొందిస్తున్నాడు.  ఈ వెబ్ సీరీస్ షూటింగ్ లో ఎక్కువ భాగం ముంబైలో జరగింది. గతంలో ఈ దర్శకుడు పిల్ల జమీందారు..భాగమతి చిత్రాలను తెరకెక్కించాడు. మహేష్ బాబు సోదరి మంజుల  తన ఇందిరా ప్రొడక్షన్ బ్యానర్లో మంజుల ఓ వెబ్ సీరీస్ ను నిర్మిస్తోందని తెలుస్తోంది.  

మొదట అ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెబ్ సీరీస్ ప్లాన్ చేసారు. అయితే అతను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. పిల్ల జమీందార్, భాగమతి చిత్రాల దర్శకుడు అశోక్ ని సీన్ లోకి తెచ్చారు. నషా టైటిల్ తో రూపొందే ఈ వెబ్ సీరిస్ కొత్తగా ఉంటుందంటున్నారు.అశుతోష్ రానా ఈ వెబ్ సీరిస్ లో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సీరిస్ ...స్టీమింగ్ అయ్యే అవకాసం ఉంది.