ప్రభాస్ వదులుకున్న సినిమాలు.. ఆ హీరోలకు బ్లాక్ బస్టర్లు

First Published 15, Nov 2019, 12:07 PM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి పదిహేడేళ్లు పూర్తవుతోంది. కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మెల్లమెల్లగా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి పదిహేడేళ్లు పూర్తవుతోంది. కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మెల్లమెల్లగా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ 17 ఏళ్ల కెరీర్ లో ప్రభాస్ చేసిన సినిమాలు 19 మాత్రమే.. అలానే ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ కథలను ఇతర హీరోలు అందుకొని హిట్లు అందుకున్నారు. ఆ సినిమాలేవో ఇప్పుడు ఓ సారి చూద్దాం!

ఒక్కడు : మహేష్ బాబు కెరీర్ ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అయితే మొదట ఈ సినిమా ప్రభాస్ వద్దకి వెళ్లిందట. చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు.. దర్శకుడు గుణశేఖర్ ని తీసుకొని ప్రభాస్, కృష్ణరాజులను కలిసి కథ వినిపించగా.. కబడ్డీ గేమ్, స్క్రిప్ట్ రిస్క్ గా అనిపించడంతో రిజెక్ట్ చేశారట.

దిల్ : నిజానికి దర్శకుడు వినాయక్ ఈ కథని ప్రభాస్ కి వినిపించాడట. కానీ అప్పటికి ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండడంతో ఇది ఒప్పుకోలేదట. ఆ తరువాత నితిన్ తో తీసి హిట్ అందుకున్నారు.

సింహాద్రి : దర్శకుడు రాజమౌళి ఈ కథను ప్రభాస్ తో చేయాలనుకొని అతడిని సంప్రదించగా.. కథ విన్న ప్రభాస్ 'స్టూడెంట్ నెంబర్ 1' లాంటి క్లాస్ సినిమా తీసిన రాజమౌళి ఇంత మాస్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయలేడేమోననే సందేహంతో రిజెక్ట్ చేశాడట.

ఆర్య : అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన ఈ స్క్రిప్ట్ ముందుగా ప్రభాస్ వద్దకు వెళ్లిందట. కానీ అతడు రిజెక్ట్ చేయడంతో ఆ తరువాత సుకుమార్ అల్లరి నరేష్ కి వినిపించాడట. అప్పటికి నరేష్ బిజీగా ఉండడంతో అల్లు అర్జున్ తో సినిమా తీసి హిట్ అందుకున్నారు.

బృందావనం : ప్రభాస్ కి 'మున్నా' లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చిన దర్శకుడు వంశీ అతడిని దృష్టిలో పెట్టుకొని 'బృందావనం' కథ సిద్ధం చేసుకున్నాడు. కానీ అప్పటికి ప్రభాస్ రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయలేకపోయాడు.

నాయక్ : ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ సిద్ధం చేసుకున్నాడట దర్శకుడు వినాయక్. కానీ ప్రభాస్ అప్పటికి 'రెబెల్' సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ కి నో చెప్పాడని సమాచారం. ఆ తరువాత పవన్ కి కూడా ఈ కథ వినిపించారట. కానీ ఫైనల్ గా రామ్ చరణ్ తో తీశారు.

కిక్ : రవితేజ క్రేజ్ పెంచేసిన ఈ సినిమా స్క్రిప్ట్ ముందుగా ప్రభాస్ వద్దకు వెళ్లింది. కానీ ఏమైందో ఏమో రవితేజతో సినిమా తీశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

ఊసరవెల్లి : ఎన్టీఆర్ కంటే ముందు ఈ కథ ప్రభాస్ కి వినిపించారట. కానీ ఎందుకో ప్రభాస్ రిజెక్ట్ చేశాడు.

డాన్ శీను : దర్శకుడు గోపీచంద్ మలినేని.. ప్రభాస్ కోసం ఈ కథ సిద్ధం చేసుకున్నారట. 'బుజ్జిగాడు' సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ని స్పూర్తిగా తీసుకొని ఈ కథ రెడీ చేసుకున్నాడు. కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో రవితేజతో సినిమా తీసి హిట్ అందుకున్నాడు.

జిల్ : ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో బిజీగా ఉన్న సమయంలో దర్శకుడు రాధాకృష్ణ ఈ కథతో ప్రభాస్ ని కలిశాడట. దర్శకుడిని వెయిట్ చేయించడం ఇష్టం లేక గోపీచంద్ తో ప్రాజెక్ట్ సెట్ చేయించాడట ప్రభాస్.

loader